Channel Avatar

R S N SHARMA @UC88t3jvOmjvxYKnVWYoNfBg@youtube.com

129K subscribers - no pronouns :c

గురువు గారి మాటలను గౌరవించే అందరికీ నమస్కారములు


Welcoem to posts!!

in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c

R S N SHARMA
Posted 2 years ago

పద్మశ్రీ గరికిపాటి నరసింహారావు గారి అభిమానులందరికీ శ్రీ ఆదిశంకరభగవత్పాదుల వారి జయంతి శుభాకాంక్షలు.

"శంభోర్మూర్తిశ్ఛరతి భువనే శంకరాచార్య రూపా"

సాక్షాత్తు ఆ పరమశివుడే శంకరభగవత్పాదుల రూపంలో ఆవిర్భవించారు. నాటి కృతయుగము దక్షిణామూర్తి నుండి నేటి కలియుగము ఆదిశంకరుల వరకూ గురుపరంపరగా వేద జ్ఞానము అందింపబడుతున్నది.

3.2K - 40

R S N SHARMA
Posted 2 years ago

విదురుడు బోధించిన కథా చిత్రం..
https://youtu.be/TkV6TvpJaig

2.6K - 8

R S N SHARMA
Posted 2 years ago

పద్మశ్రీ గరికిపాటి నరసింహారావు గారి అభిమానులందరికీ నా నమస్కారములు.

నలుదిక్కులా దేశ విచ్చిన్నకర శక్తులు పెరిగిపోతున్న ఈ తరుణంలో, కొన్ని సంస్థలు సనాతన ధర్మ స్థాపన కోసం పాటుపడుతూ ప్రజలలో నైతిక విలువలు పెంపొదిస్తూ, జాతీయ వాదాన్ని ప్రోత్సాహిస్తూ, హిందూ ధర్మం పట్ల అవగాహన కల్పిస్తూ, ధర్మ పరిరక్షణకై పాటుపడుతున్నవి. అలాంటి సంస్థలను, వార్తాపత్రికలను ప్రోత్సహించడం మన నైతిక బాధ్యత. కావున దయచేసి వాటిని కూడా ప్రోత్సహించగలరు.

ధన్యవాదములు..

Please subscribe below channels..

@String ‪@NationalistHub‬

‪@SHIVASHAKTHI‬ ‪@HinduJanaShakti‬

‪@kshaatram‬ ‪@BhaaratTodayNew‬

778 - 19

R S N SHARMA
Posted 2 years ago

సభ్యులందరికీ జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు #వివేకానంద #vivekananda #swamivivekananda

906 - 5

R S N SHARMA
Posted 3 years ago

#ఆత్మబోధ #atmabodha #adishankaracharya #ఆదిశంకరాచార్య

సూక్ష్మ శరీరము పదిహేడు పదార్థముల సమ్మేళనమగు స్థూల శరీరము యొక్క పంచ ప్రాణములు (ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన), పంచ జ్ఞానేంద్రియములు (కళ్ళు, చెవులు, నాలుక, ముక్కు, చర్మము), పంచ కర్మేంద్రియములు (నోరు, చేతులు, కాళ్ళు, విసర్జన అవయవములు), మనస్సు మరియు బుద్ది ద్వారా ఆనందాన్ని మరియు బాధను కలుగజేస్తుంది.

వృద్ధాప్యంలో గాని, అనారోగ్యంతో గాని శరీరం కృశించి నశించినపుడు ఆత్మ మరియొక శరీరాన్ని ధరిస్తుంది. ఆత్మ శరీరాన్ని ధరించి స్థూల శరీరం నుండి రాగద్వేషాలకు, సుఖదుఃఖాలకు లోనవుతుంది. పుణ్య, పాపాలు అను కర్మల వలన పునర్జన్మలు కలుగుతాయి.

కానీ జీవుడు ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకుని తన ఆత్మకు మూలమైన పరమాత్మలో ఐక్యం చేయగలడో అప్పుడే పునర్జన్మ నుంచి విముక్తి పొందగలడు. దానినే మోక్షము అంటారు. లేదా జీవుడు తన కర్మానుసారంగా వచ్చే పునర్జన్మలు కానీ, పాపపుణ్యాల ఫలితం గానీ అనుభవింపక తప్పదు.

ధన్యవాదములు..🙏🙏

The Sookshma Sareera, subtle body is a combination of seventeen ingredients, the five Pranas are Prana, Apana, Vyana, Udana and Samana, ten Organs (five organs of perception - Eyes, Ears, Tongue, Nose and Skin and five organs of activity - Mouth, Hands, Legs and organs of excretion), Mind and Intellect, the instruments with which we experience pain and pleasure.


The Sthoola Sareera gross body, is the
one that gets old, diseased and dies.
Sookshma Sareera leaves the gross body at
the time of death and gets rebirth. It is not
Atma that gets rebirth, according to Adwaita
Doctrine.

Atma is nothing but a form of Paramatma. It monifests itself in Sookshma
Sareera and gets involved in the ties of human relations and gets elations and sorrows. It also does various Karmas both good and bad. Naturally the results follow and the Sookshma Sareera gets the rewards called good births and punishments called mean births.

This process of rebirths stops only if in any birth this Sookshma Sareera gets out of illusion and understands the Atma in its body and gives up all worldly attachments and starts leading a life that befits Paramatma. Then it will join Paramatma which is called Moksha. Till it is attained this worldly pleasures and sorrows will be hunting it in every birth.


Thank you..🙏🙏

647 - 12

R S N SHARMA
Posted 3 years ago

ఆది శంకరాచార్యుల వారి రచనలను, తాత్వికతను ప్రోత్సహిస్తున్న సనాతన ధర్మ వారసులందరికీ ధన్యవాదములు.

ప్రతీ జీవి శరీరం ఆకాశం, భూమి, వాయువు, అగ్ని, జలము అను పంచభూతాలతో నిర్మితమైనది. దీనిని స్థూల శరీరం ఆంటారు. సూక్ష్మమైన ఆత్మ, స్థూల శరీరాన్ని మాధ్యమంగా చేసుకుని అనుభూతిని, ఆనందాన్ని మరియు బాధను కలుగజేస్తుంది.
దీనికి సరిగ్గా భిన్నంగా నేటి ఆధునిక విజ్ఞానం వివరిస్తుంది. కానీ పూర్వం ఋషులు దీనిని ముందే గ్రహించారు.

ఆకాశం - జీవి శరీరంలో గల ఖాళీ స్థలం

భూమి - వివిధ రకాల కణాల సముదాయం

వాయువు - ఉశ్చ్వాస, నిశ్చ్వాసల ద్వారా ప్రాణవాయువు సేకరించడం

అగ్ని - జీర్ణవ్యవస్థకు ఉపయోగపడే ఆమ్లాలు మరియు రక్త ప్రసరణ ద్వారా కలిగే ఉష్ణోగ్రతలు

జలము - శరీర ఉష్ణోగ్రతల ప్రభావాన్ని సమాన స్థాయిలో ఉంచడం

ఈ పంచభూతాలు ఎల్లప్పుడూ ఒక దానిపై మరొకటి ఆధారపడతాయి. వీటిలో ఒక్కటి నశించినా జీవికి మృత్యువే ఖాయం. పూర్వ జన్మ కర్మల ఫలితంగా భగవంతుడు జీవుల శరీరాన్ని సృష్టిస్తున్నాడు. కర్మల ప్రభావానికి భగవంతుడైనా అతీతుడు కాదు.

భగవంతుడు అంటే ఎవరు?

సూర్యుడు అన్నిచోట్లా ఒకేలా ప్రసరిస్తాడు. అది సూర్యుడి ధర్మము. భూమిపై గల వాతావరణ మార్పుల ద్వారా, భూభ్రమణ వ్యత్యాసాల ద్వారా వేరు వేరు ప్రదేశాలలో దాని ప్రభావం ఉంటుంది. కానీ ఒకచోట అధిక వేడి వలన లేక అల్ప ఉష్ణోగ్రతల వలన ప్రజలు నష్టం పొందుతారు. దానికి కారణం సూర్యుడే అని నిందిస్తారు. ప్రకృతి వినియోగ స్థాయిని బట్టి జీవన క్రియ ఆధారపడుతుంది.

అలాగే మానవుడు తాను చేసే కర్మలు, మనసులో చేసే ఆలోచనల ఫలితంగానే జీవుల జన్మలు ఆధారపడతాయి. అంతేకానీ భగవంతునికి పుణ్యాత్ముల మీద ప్రత్యేక కరుణ కానీ, పాపాత్ములపై ప్రత్యేక ద్వేషం కానీ లేదు.

ధన్యవాదములు..🙏🙏

Thank you to all the descendants of Sanatana Dharma for promoting the writings and philosophy of Adi Shankaracharya.

The body of every living being is made up of the five elements of sky, earth, air, fire and water. This is called the gross body. The subtle soul mediates the gross body and causes sensation, pleasure and pain. Modern science today explains exactly the opposite. But the ancient sages realized this before they knew it.

The sky - the empty space in the body of the creature

Earth - a collection of different types of cells

Air - The collection of oxygen through inhalation and exhalation

Fire - Acids that are useful for the digestive system and temperatures caused by blood circulation

Water - Keeping the effect of body temperature equal.

These Panchabhutas are always dependent on one another. If any of these perish, the creature is doomed to death. God is creating the body of living beings as a result of pre-birth rituals. God is no stranger to the influence of karma.

Who is God?

The sun radiates the same everywhere. That is the nature of the sun. Its effect on different places is due to the changes in the earth's climate and the changes in the rotation of the earth. But elsewhere people suffer from high heat or low temperatures. They blame the sun for it. Life expectancy depends on the level of nature consumption.

Similarly, the births of living beings depend on the deeds done by human beings and the thoughts of the mind. And God has no special mercy on the pious, nor does he have a special hatred on the sinners.

Thank you..🙏🙏

866 - 15